AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాఫియా వినోద్ ఇంటిని కూల్చివేసిన అధికారులు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు చెందిన మాఫియా వినోద్ ఉపాధ్యాయ ఇంటిని అధికారులు కూల్చేశారు. రౌడీ షీట‌ర్ వినోద్‌పై 25 కేసులు ఉన్నాయి. బెదిరింపులు, హ‌త్యాయ‌త్నం లాంటి కేసుల్లో అత‌ను వాంటెడ్‌. అత‌నిపై త‌ల‌పై 50 వేల రివార్డు కూడా ఉంది. ప్ర‌స్తుతం వినోద్ ఉపాధ్యాయ ప‌రారీలో ఉన్నాడు. ఉద‌యం గ్యాంగ్‌స్ట‌ర్ వినోద్ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. వినోద్ త‌మ్ముడు సంజ‌య్ ఉపాధ్యాయ‌పై కూడా హిస్ట‌రీ షీట్ ఉంది. ఆ ఇద్ద‌రు సోద‌రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూపీలో ఉన్న 61 మంది మాఫియా వ్య‌క్తులో వినోద్ ఒక‌డు. 2014లో అత‌నిపై హ‌త్యాయ‌త్నం కేసు బుక్ చేశారు. అయితే బెయిల్‌పై రిలీజైన త‌ర్వాత అత‌ను ప‌రారీ అయ్యాడు.

ANN TOP 10