AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ బద్ధలైన కిలౌయా అగ్నిపర్వతం.. భారీగా జ్వాలలు..

అమెరికా జియోలాజికల్ సర్వే హవాయిలో ఏర్పాటు చేసిన అగ్నిపర్వత అబ్జర్వేటరీ… తాజాగా… కిలౌయా అగ్నిపర్వతం పేలిన విషయాన్ని బయటపెట్టింది. పర్వత శిఖరాగ్రం నుంచి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

అగ్నిపర్వత పేలుడు తర్వాత.. అక్కడి ఉపరితలంపై లావా ప్రవహిస్తోంది. ఈ పేలుడుకి ముందు… పర్వత ప్రాంతంలో.. భూ ప్రకంపనల స్థాయి పెరిగిందని అబ్జర్వేటరీ ద్వారా తెలిసింది. మంగళవారం రాత్రి నుంచే ఈ ప్రకంపనల స్థాయి పెరిగింది. గురువారం పర్వతం నుంచి భారీగా లావా బయటకు వచ్చింది.

అబ్జర్వేటరీలోని జియాలజిస్ట్ మైక్ జోల్లెర్ మాట్లాడుతూ… “ప్రస్తుతం అగ్ని పర్వతం ప్రశాంతంగా ఉంది. లావా ప్రవాహం ఉన్నప్పటికీ దాని ద్వారా ద్వీపంలోని ప్రజలకు హాని కలిగే ప్రమాదం ఉందని అనుకోవట్లేదు” అని తెలిపారు.

కిలౌయా అగ్నిపర్వతం… ఉత్తర అమెరికా దిగువన ఉండే మెక్సికోకి పశ్చిమంగా… 5,441 కిలోమీటర్ల దూరంలో ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో ఉంది. అందువల్ల ఇది పేలినప్పటికీ.. అమెరికాకు ఏ సమస్యా రాలేదు. అలాగే.. ఈ పర్వతం చుట్టుపక్కల హవాయి అగ్నిపర్వతాల జాతీయ ఉద్యానవనం ఉంది. దానికి కూడా ఏ సమస్యా రాలేదు. అలాగే.. పర్వతానికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా కాస్త దూరంగా ఉండటం వల్ల.. ఎలాంటి హానీ జరగలేదని తెలిసింది.

ఈ పర్వతంపై ఇదివరకు జరిగిన పేలుళ్ల వల్ల ఓ భారీ బిలం ఏర్పడింది. అందులో లావా ఉంది. ఈ బిలం 317 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది దాదాపు 4,300 అడుగుల వెడల్పు కలిగి ఉంది. చుట్టూ సముద్రం ఉన్నా.. ఈ పర్వతం వేడివేడిగా ఉండటాన్ని బట్టీ.. భూమి లోపల ఆవిరి, ఒత్తిడి బాగా ఉందని అనుకోవచ్చు.

ANN TOP 10