తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం సిద్ధించిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మిన్నంటాయి. అధికారి బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రులు జిల్లా్ల్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు.
ఇక కేవలం రాజకీయ నాయుకులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.









