AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు టీపీసీసీ విస్తృత సమావేశం

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం గాంధీ భవన్‌లోని ప్రకాశం హాల్లో టీపీసీసీ విస్తృత సమావేశం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ రోజున గ్రామ గ్రామానా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్య నేత ఒకర్ని ఆహ్వానించాలనుకుంటున్నారు.

ఈ అంశాలపైన చర్చించి కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ తదితర డిక్లరేషన్లపైన, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలపైనా చర్చిస్తారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల సన్నాహక సమావేశంగానూ ఇది జరుగుతుందని చెబుతున్నారు.

ANN TOP 10