లండన్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా యూకేలోని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే ప్రెసిడెంట్ రత్నాకర్ ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. అయితే మంత్రి కేటీఆర్ తమ ఇంటికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎన్ఆర్ఐ రత్నాకర్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. దేవుడు తమ ప్రార్థనలు ఆలకిస్తే, ఆ దయామయుడు కరుణిస్తాడని, అలాంటి వేళ జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయని ఎన్ఆర్ఐ రత్నాకర్ తన వీడియోకు కామెంట్ చేశారు.
ప్రేమపూర్వక సోదరుడు, మంత్రి, డైనమిక్ నేత కేటీఆర్.. లండన్‌లోని తమ ఇంటికి వచ్చినట్లు రత్నాకర్ ఆ వీడియోలో తెలిపారు. ఎన్ఆర్ఐ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. రత్నాకర్ ఫ్యామిలీతో చాలా సమయాన్ని గడిపారు. రత్నాకర్ కుమారుడు రణవ్‌ను ఎత్తుకు ఆడించారు. ఆ పిల్లవాడిని భుజంపై వేసుకుని మంత్రి కేటీఆర్ నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. తమ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఆశీర్వదించారని ఎన్ఆర్ఐ తన ట్వీట్‌లో తెలిపారు.









