AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుర్తుతెలియని మహిళ తల లభ్యం..

హైదరాబాద్: మహిళ తల కవర్‌లో కనిపించిన సంఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతం మూసి నది పక్కన జరిగింది. మహిళ తల నల్లటి కవర్‌లో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడే పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్‌తో కలిసి పోలీసులు విచారణ చేస్తున్నారు. కవర్‌లో తల కనిపించగానే స్థానికులు భయంతో వణికిపోయారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు నరికి మూసి నదిలో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10