AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ బిడ్డలారా.. కేసీఆర్ మిమ్మల్ని చూస్తారట..

విజయశాంతి సెటైరికల్ పోస్ట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జిల్లాల పర్యటనపై బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) తనదైన రీతిలో స్పందించారు. కేసీఆర్ (Telangana CM) ఈరోజు ఖమ్మం (Khammam), వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. దీనిపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ‘‘తెలంగాణ బిడ్డలారా… ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మలను చూస్తారట. ఏడాదికోసారి అచ్చే ఉగాది లెక్క.. మల్ల ఎప్పుడు కన్పడ్తరో.. లేదో ఈ గాలి మోటార్లలో తిరిగే దొరగారు ? స్వాగతిస్తరో… లేదా ఓటు ద్వారా వచ్చే ఎన్నికలల్ల సెలవిస్తమని చెప్తరో మీ విజ్ఞత’’ అంటూ సోషల్ మీడియా (social Media)వేదికగా సెటైరికల్ పోస్ట్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10