హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జైలు శిక్ష బిజెపి రాజకీయ కక్ష సాధింపు చర్య అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. సిట్ ముందు రేవంత్ హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్‌లు అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో కర్నాటకలోని కోలార్‌లో మోడీపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు విధించింది.
టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ విషయంలో సిబిఐతో విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. టిఎస్‌పిఎస్‌సి అక్రమాల పుట్టగా మారింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని దుయ్యబట్టారు. తప్పును ఎత్తి చూపడమే నేరంగా పరిగణిస్తున్నారని, వెనక్కి తగ్గే సమస్యే లేదన్నారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్డి విచారణ కోసం కొట్లాడుతమని, 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని రేవంత్ స్పష్టం చేశారు.