AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో ఇప్పటికే గత కొద్ది రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. అయితే మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముంది. రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ మేరకు శనివారం రాత్రి వెదర్ బులిటెన్‌ను విడుదల చేసింది.

ఆదివారం రాష్ట్రంలోని మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.

ఇక 24వ తేదీ కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వరంగల్, జనగాం, హనుమకొండ, కరీంనగర్, మహబూబాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తన బులిటెన్‌లో స్పష్టం చేసింది. అలాగే 25వ తేదీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

ANN TOP 10