AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్‌లో బిగ్ అప్‌డేట్..! నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే..?

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌కేసులో త్వరలో సంచనాలు తెరపైకి రాబోతున్నాయా? బడా నేతలు అరెస్టు ఫ్రేమ్‌లోకి రావడం ఖాయమా? సిట్‌ ఎంక్వయిరీ దాదాపుగా క్లైమాక్స్‌కు చేరుకుంది. డిసెంబర్‌ రెండో వారంలో..అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కౌంట్‌ డౌన్‌ మొదలైందనే టాక్‌. చర్చగా మారిందిప్పుడు.

సంచలనాలు కమింగ్‌ సూన్‌ అంటూ భారత్‌ సమ్మిట్‌ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి అలా హింట్‌ ఇచ్చారు. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ రెండో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి, న్యాయపరమైన అంశాలపై స్పష్టత తీసుకున్న తర్వాత సిట్ దూకుడు పెంచింది. కేసు నమోదైన తొలినాళ్లలో.. నిందితులు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడం, సాక్ష్యాలను మాయం చేయడం, ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడంతో.. విచారణకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు, రికవరీ చేసిన టెక్నికల్ డేటా, బాధితులు, సాక్షుల వాంగ్మూలాలతో అదనపు చార్జ్‌ షీట్‌ను పకడ్బందీగా ఫ్రేమ్‌చేసినట్టు తెలుస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్య.. 15 రోజుల గ్యాప్‌లో ఏకంగా 4 వేల 13 మంది ఫోన్లపై నిఘా పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇందులో 618 మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్ సంభాషణలను అక్రమంగా రికార్డ్ చేసినట్లు సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటివరకు ఆరుగురు పోలీసు అధికారులను నిందితులుగా చేర్చింది సిట్.

ఛార్జ్‌షీట్ దాఖలయ్యాక కోర్టు ఆదేశాల మేరకు కీలక వ్యక్తులపై చర్యలు, మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశముందనే చర్చ జోరందుకుంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పేర్లుండొచ్చనే పలు కథనాలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలని ఖండించారు బీఆర్‌ ఎస్‌ నేతలు. విచారణలో రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. ఇక నవంబర్ 2న హరీశ్ రావుకు సంబంధించిన మరో ఫోన్ ట్యాపింగ్ కేసును పంజాగుట్ట నుంచి సిద్ధిపేటకు బదిలీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ బీఎస్పీ అభ్యర్థి పిటిషన్‌ వేశారు.

ఇప్పుడు అందరి ఫోకస్‌ రెండో ఛార్జ్‌ షీట్‌ పైనే ఉంది. అందులో ఎవరెవరిపేర్లుంటాయి? సిట్‌ ఎలాంటి ఆధారాలు సేకరించింది? అనే చర్చ నడుస్తోంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్ ఫామ్‌హౌస్ లెక్కలు, ధరణి CID కేసు దాదాపు తుది దశకు చేరాయన్నారు. సాంకేతిక అంశాలు, సరైన లెక్కలతో BRS అక్రమాలను బయటపెడతామన్నారు.సర్వేల పేరుతో BRS పగటికలలు కంటోందని, గోల్ మాత్రం తామే కొడతామన్నారు.

ANN TOP 10