చిరంజీవి సినిమా అంటే ఆడియన్స్ లో ముఖ్యంగా అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉంటుంది.ఇక అలాంటిది వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ కాంబోలో వస్తున్న ‘కాకా’ ఎన్ని అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాకి రైటర్ గా పని చేస్తున్న కోన వెంకట్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
తను తీసిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా షూటింగ్ సమయంలోనే కాదు.. సెన్సార్ దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, అలాగే సినిమా కోసం తాము పడిన కష్టం, ఎదురైన సమస్యలు, మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం గురించి వివరించాడు.
కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో అశ్లీలత లేదని, భారీగా రక్తపాతం చూపించే సన్నివేశాలు కూడా లేవని ఆయన చెప్పారు. అయినప్పటికీ సెన్సార్ దగ్గర అనుకున్నంత సులభంగా పని జరగలేదని తెలిపాడు. దీనికి ప్రధాన కారణం సినిమాలోని నక్సలిజం అని దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నక్సలిజం ఉండటంతో, సెన్సార్ సర్టిఫికేట్ ఈజీగా రాలేదని తెలిపాడు.
సినిమాలో నక్సలైట్లను గొప్పవారిగా చూపించకూడదనే రూల్స్ గురించి కూడా చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే తమ సినిమాలో అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కథ చివర్లో పాత్రలు మారతాయని, సమాజంలో ఉంటూ ప్రజలకు ఉపయోగపడే జీవితాన్ని ఎంచుకోవాలనే సందేశం ఉంటుందని వివరించారు. అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలను విడిగా చూడటం కంటే, కథ మొత్తాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు
ఈ సమస్య మరింత పెద్దదిగా మారడంతో సినిమా విడుదలపైనే సందేహాలు ఏర్పడ్డాయని . ఒక దశలో ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం కష్టమనే పరిస్థితి వచ్చిందని కోన వెంకంట్ చెప్పుకొచ్చారు. దాదాపు రూ.22 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత రిలీజ్ కి పర్మిషన్ లేకపోతె నిర్మాత పరిస్థితి ఏంటని ఆందోళన చెందినట్లు చెప్పారు. రెండేళ్లపాటు ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్లు కష్టపడి చేసిన సినిమా కావడంతో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నించాల్సి వచ్చిందని వివరించారు.
ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోవడానికి ఢిల్లీకి వెళ్లి అక్కడి అధికారులకు తన వాదన వినిపించానని . సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి? కథ ద్వారా చెప్పాలనుకున్న విషయం ఏమిటి? అనే అంశాలను చెప్పినట్లు తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు హిందీలోనే మాట్లాడి, సినిమా ఉద్దేశాన్ని అర్థమయ్యేలా వివరించానని చెప్పారు. తన వాదనతో కొంతమంది అధికారులు ఏకీభవించినప్పటికీ, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని వాపోయారు.
దీంతో కాక షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను కాస్త దిగులుగా ఉండటాన్ని గమనించిన చిరంజీవి ఏమైందని అడిగారని ,సెన్సార్ దగ్గర ఎదురవుతున్న సమస్యలను ఆయనకు వివరించడంతో చిరంజీవి వెంటనే స్పందించారని కోన వెంకట్ చెప్పారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సమస్య వెంటనే సాల్వ్ చేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ ఇంటికి నడుచుకుంటూ వచ్చిందని తెలిపాడు.
ఇక చిరంజీవి సినిమా అంటే కామెడీ, ఫైట్లు, పాటలు, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆశిస్తారని, కానీ పైగా ఇదొక గ్యాంగ్ స్టర్ సినిమా అనుకుంటున్నారని ,కానీ ‘తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం ముఖ్యంగా ఉంటుందని తెలిపాడు. తండ్రి, కూతురి మధ్య ఉండే ఎమోషన్స్ కథలో కీలకంగా ఉంటాయని తెలిపారు.
టీజర్ గురించి మాట్లాడుతూ సినిమాలోని ఒక చిన్న భాగమేనని, కథలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చిరంజీవి పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్’ అని, ‘కాకా’ గా షార్ట్ గా పిలుస్తారని అసలు విషయం చెప్పుకొచ్చాడు.ఇక సినిమా అప్పుడే 70 నుంచి 75 శాతం పూర్తయినట్లు చెప్పుకొచ్చాడు కోన.మొత్తానికి కోన తన సినిమాకోసం పడ్డ కష్టం, దానికి చిరు చేసిన సాయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది !








