AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాయచోటిలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు..! దగ్గమైన ఐదు కార్లు,15 వాహనాలు ధ్వంసం..

ఏపీలో ఏం జరుగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా ఆపాలని వైసీపీ ప్లాన్ చేస్తుందా? ఇన్నాళ్లు సైలెంట్‌గా నేతలు, నామినేషన్ల సమయంలో దాడులకు తెగబడుతున్నారా? రాళ్ల దాడులు, వాహనాలు తగులబెట్టడం వెనుక ఏం జరుగుతోంది? ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేస్తోందా? అవుననే అంటున్నారు అధికార పార్టీ నేతలు.

ఏపీలో శుక్రవారం నుంచి మున్సిపల్ నామినేషన్ల ఘట్టం మొదలైంది. దీంతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల సందర్భంగా టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఈ ప్రాంతంలోనే రెండు పార్టీలకు చెందిన ఆఫీసులు ఉన్నాయి.

కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి జఠిలంగా మారింది. ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఆఫీసులపై దాడులకు దిగి నిప్పు పెట్టారు. బయట పార్కు చేసిన వాహనాలకు నిప్పుపెట్టారు. దాదాపు 10 వాహనాలు దగ్దమయ్యాయి. 5 కార్లు తగలబడ్డాయి.

ఈ ఉదయం వైసీపీ ఆఫీసులో శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.  అది జరిగి కొద్దిసేపటికి మంత్రి రాంప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, టీడీపీ ఆఫీసు పైకి దూసుకొచ్చాయి. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలతో కవ్వింపు చర్యలకు దిగారు. ఇరు వర్గాల మాటల యుద్ధం తీవ్రం కావడంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. తమతో తెచ్చుకున్న రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. కాలనీలోని ఉన్న ఐదు కార్లకు వైసీపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. 15 కార్లను ధ్వంసం చేశారు.

ఘర్షణలు తీవ్రంగా కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారి వాహనంపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఐ కారు ధ్వంసమైంది. కానిస్టేబుల్ పెంచలయ్యకు గాయాలు అయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి బలగాలు తరలించారు. అటు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచనతో వైసీపీ పక్కా ప్లాన్‌తో దాడులకు తెగబడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో కావాలనే అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ANN TOP 10