AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖైరతాబాద్ ఉపఎన్నికలో బలమైన అభ్యర్థిని నిలబెడతాం: కవిత..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై స్పందించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని, బలమైన అభ్యర్థిని నిలబెడతామని ఆమె ప్రకటించారు. దసరా రోజున ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టి రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు కరవుతో అల్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం గోవా, ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాబోయే ఏడెనిమిది నెలల పాటు ప్రజల్లోనే ఉండి క్షేత్రస్థాయిలో పోరాడతామని కవిత స్పష్టం చేశారు. నవంబర్ చివరి వరకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను వెంటనే పునరుద్ధరించి పూర్తి చేయాలని కోరారు. పారదర్శకత కోసం ఇకపై అన్ని ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్లోబల్ సమ్మిట్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు.

ANN TOP 10