ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న భారీ చిత్రాల్లో ఒకటే ‘రామాయణ’. రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ ఇతిహాస కావ్యంని హాలీవుడ్ ప్రమాణాలతో సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాకి హాలీవుడ్ ఆస్కార్ సంస్థ DNEG వారు గ్రాఫిక్స్ అందించారు. అయితే చాలా వరకు విజువల్స్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మాత్రం ఆడియెన్స్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి.
అలానే నిన్న వదిలిన కొత్త ప్రోమో చూసి మళ్ళీ వీళ్ళు హాఫ్ బేక్ ప్రోడక్ట్ ని ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. నిన్న రణబీర్, ఓ రాక్షసునిపై యుద్ధం తాలూకా ప్రోమోని వదిలితే ఇందులో విజువల్స్ చూసి మళ్ళీ ఆడియెన్స్ విస్తుపోతున్నారు. అసలు DNEG (డీనెగ్) వారు ఎలా ఇంత తక్కువ క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నేడు వచ్చే ట్రైలర్ లో విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలి.







