AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావ్..? ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అభిజిత్ దీప్కేకు నిరసన సెగ..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక వ్యక్తి ఆయనను అడ్డుకుని నిలదీశారు. “దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు?” అంటూ ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీప్కే మాత్రం నవ్వుతూ, నిరసనకారుడికి థమ్సప్ చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అక్టోబర్ 10న తన నానమ్మ మరణించడంతో స్వస్థలమైన మహారాష్ట్రకు వెళ్లిన దీప్కే, బుధవారం మధ్యాహ్నం తిరిగి రాజధానికి చేరుకున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న నిరసనలకు నాయకత్వం వహించేందుకు వచ్చినప్పుడు కూడా పోలీసులు ఆయనను విమానం నుంచి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే, తన సహచరులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను అరెస్ట్ చేసి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం నేరమా? కేవలం జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగరేసినందుకే అశుతోష్, సౌరవ్‌లను ఐదు రోజులు జైలుకు పంపారు. గతంలో బ్రిటిష్ పాలనలో ఇలా జరిగేది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులు బహిరంగ ప్రదేశాల్లో జెండా ఎగరేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు” అని దీప్కే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ANN TOP 10