AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు: మంత్రి పార్థసారథి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించరాదన్న నిబంధనను అధిగమించేందుకు అవసరమైన శాస్త్రీయ సమాచారాన్ని ప్రభుత్వం సమర్పించలేదని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ప్రస్తుతానికి స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ కోటాను అమలు చేసేందుకు చట్టపరమైన ఆటంకాలు ఏర్పడ్డాయి.

ఈ తీర్పు నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, తమ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పలేదు. త్వరలోనే బీసీ గణన పూర్తి చేసి, దానికి ఆమోదం పొంది రిజర్వేషన్లు కల్పిస్తాం. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయి” అని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా వైసీపీపై మంత్రి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంపై, ఎన్నికలపై వైసీపీకి నమ్మకం లేదని, గత రెండున్నరేళ్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదని ఆయన ఆరోపించారు. చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా, తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలకు సముచిత రాజకీయ అవకాశాలు కల్పిస్తామని పార్థసారథి హామీ ఇచ్చారు.

ANN TOP 10