AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖైరతాబాద్ పేరు మార్చాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి..!

ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాల విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి ప్రభుత్వం పేరుమార్చాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైతరాబాద్‌ని ‘గణేష్‌పురి’గా నామకరణం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా తర్వాత దేశవ్యాప్తంగా ఖైరతాబాద్‌ గణేశుడే అత్యంత ప్రసిద్ధి అని గుర్తుచేశారు. అందుకుగాను చారిత్రక కాలం నాటి పాత పేర్లను మార్చి, మన దేశ హిందూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లను పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజాసింగ్ అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఖైరతాబాద్‌ పేరును ‘గణేష్‌పురి’గా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశ సాంసృతిక కార్యక్రమాలతో హిందూవులు అత్యధింగా ఆరాదిస్తారని, ఖైరతాబాద్ గణనాథుడిని చూడడాని ప్రతి రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వీటంన్నిటిని దృష్టిలో ఉంచుకోని ప్రభుత్వం నిర్ణయం తీసుకొవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి తెలిపారు.

ANN TOP 10