ఉమెన్ ఆంధ్రాప్రీమియర్ లీగ్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుండగా, భారత్ క్రికెట్ జట్టు ప్లేయర్లు ఉన్న హాట్ ఫేవరెట్ రాయలసీమ జెనెక్స్ స్టార్ జట్టుకు ప్రముఖ నటి, పాన్ ఇండియా హీరోయిన్ నిధి అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కడపలో రాయలసీమ జెనెక్స్ స్టార్ జట్టు జెర్సీ లాంచ్ కు కూడా ఆమె హాజరుకానున్నారు. రాయలసీమ జెనెక్స్ స్టార్ జట్టుకు నిధి అగర్వాల్ శుభాకాంక్షలు తెలిపారు. నిధి అగర్వాల్ ఎన్నో సూపర్ హిట్, అగ్ర హీరోల చిత్రాల్లో నటించారు. ఇస్మార్ట్ శంకర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరిహరవీరమల్లు, ప్రభాస్ సరసన రాజా సాబ్, అఖిల్, నాగచైతన్య సరసన కూడా నటించింది. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ సరసన, తమిళ్ లో శింబు సరసన ముద్దుగుమ్మ నటించింది. పాన్ ఇండియా స్తాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్ నిధి ఉమెన్ ఏపీఎల్ టీమ్ కు మద్దతుగా రావడం, రాయలసీమ జెనెక్స్ స్టార్ జట్టు ఆమెను తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. దీంతో రాయలసీమ జెనెక్స్ మొత్తం ఏపీఎల్ లోనే స్పెషల్ గా మారింది. రాయలసీమ జెనెక్స్ స్టార్ జట్టుకు ఆర్టిస్ట్ కో -ఆర్డినేటర్ గా బ్రాండ్ ఎక్స్ఓ వ్యవహరిస్తోంది. ప్రపంచకప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి వంట ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.
………………………………..








