నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈయన అఖండ2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి కానీ అఖండ 2 విషయంలో మాత్రం అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకొని నేపథ్యంలో బాలకృష్ణ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
NBK 111 షూటింగ్ పనులలో బాలయ్య..
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టి కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
మే 1న పూజ కార్యక్రమాలు..
ఇక కొరటాల శివ సినిమా గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కొరటాల శివ ఒక యాక్షన్ స్టోరీని బాలకృష్ణకు చెప్పడంతో బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయిందని త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ సినిమా పూజ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా మే ఒకటవ తేదీ పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా ప్రారంభించబోతున్నారు. ఇలా మే 1వ తేదీ పూజ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.
2027 సంక్రాంతిని టార్గెట్ చేసిన బాలయ్య..
పూజ కార్యక్రమాల అనంతరం ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గోపీచంద్ మలినేని సినిమాతో పాటుగా షూటింగ్ పనులను జరుపుకోనున్నారు. ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేలాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఇతర నటినటుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయాలకు సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించబోతున్నట్లు సమాచారం.








