AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… 14న బడ్జెట్..!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో ఈ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

 

గవర్నర్ ప్రసంగం అనంతరం, సభలో ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 12న ఈ తీర్మానంపై చర్చ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ చర్చకు సమాధానం ఇస్తారు.

 

ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. దాదాపు నాలుగు వారాల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం పొందడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దే

శం.

ANN TOP 10