AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండా సురేఖ భర్తరఫ్‌! మంత్రివర్గం నుంచి ఔట్‌.. సీఎం రేవంత్‌కు హైకమాండ్‌ ఆదేశాలు!

తప్పుకోవడానికి నిరాకరిస్తే వేటే..
సీఎం రేవంత్‌కు హైకమాండ్‌ ఆదేశాలు!

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మంత్రి కొండా సురేఖను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని హైకమాండ్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్‌ ను కంట్రోల్‌ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్‌ లేదని రేవంత్‌ కు స్పష్టం చేసినట్లు సమాచారం. సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సినీ ఇండ్రస్ట్రీ ముక్త కంఠంతో ఖండించింది. కాంగ్రెస్‌ కు సైతం ఈ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.

దీంతో హైకమాండ్‌ ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే సీఎం రేవంత్‌ తో చర్చించిన అగ్ర నాయకత్వం కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్‌ చేయాలని ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా రాజీనామా చేయాలని సురేఖను కోరాలని సూచించినట్లు సమాచారం. ఆమె తప్పుకోవడానికి నిరాకరిస్తే వేటు వేయాలని హైకమాండ్‌ రేవంత్‌ రెడ్డికి స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది.

దసరాకు మంత్రి వర్గ విస్తరణ..
ప్రస్తుతం జరిగిన డ్యామేజ్‌ ను కంట్రోల్‌ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్‌ లేదని హైకమాండ్‌ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకు మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్‌ నుంచి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఈ సమయంలోనే కొండా సురేఖ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10