తిరుమల అంశంపై మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో ఇవాళ(శనివారం) సమీక్ష నిర్వహించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.
మరింత సమాచారాన్ని రేపు(ఆదివారం) టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన సూచనలను ఈవో వివరించారు. నేడు ఆగమ సలహాదారులు, అర్చకులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచనల గురించి తెలిపారు.
మరింత విస్తృత సంప్రదింపుల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుమల పవిత్ర కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.