AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దసరా పండగ సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా పండగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులను డిక్లేర్​చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 2వ తేదీ(బుధవారం) నుంచి 14వ తేదీ(సోమవారం) వరకు సెలవులుగా ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక జూనియర్​కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్​6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన-ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..? అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తంగా 13రోజులు సెలవుల తర్వాత అక్టోబర్​15(మంగళవారం) రోజున విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలు అక్టోబర్​14న తెరుచుకోనున్నాయి.​వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10