టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 ప్రమాదానికి గురైంది. విమానాశ్రయంలోని రన్ వేపై దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఆ దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ప్రసారం చేసిన వీడియోల్లో విమానం కిటికీల నుంచి మంటలు రావడం కనిపించింది. కాగా.. ఈ ప్రమాదానికి కారణం కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీ కొట్టడమేనని తెలిపింది.
కాగా.. ఈ ఘటన పై జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. హక్కైడోలోని షిన్-చిటోస్ విమానాశ్రయం నుండి 300 మందికి పైగా ప్రయాణీకులతో విమానం బయలు దేరినట్లు చెప్పారు. విమానం రన్ వే పై దిగుతున్న కోస్ట్ గార్డు ఎయిర్ క్రాఫ్ట్‌ను ఢీ కొట్టిన్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.









