AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల బంద్

లారీల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ నగరంతోపాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులను యజమానులు వేసివేశారు. మలక్ పేట, చంచల్‌గూడలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తిరుతున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయసంహిత -2023 మోటారు వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లారీల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట హెచ్ పీసీఎల్ టెర్మినల్ వద్ద ఆయిల్ ట్యాంకర్స్ వర్కర్స్ అండ్ డ్రైవర్ల యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన చట్టం డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ 200 ట్యాంకర్లను నిలిపివేసి లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో ఇంధన సరఫరా నిలిచి పోయింది.

ANN TOP 10