స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం పుష్ప. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ ఊరమాస్ పుష్పరాజ్ పాత్రలో నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ రికార్డ్స్ బద్దలుకొట్టింది.
ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 చిత్రీకరణ జరుగుతుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్స్ మాత్రం ఆగడం లేదు.
పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతుందంటూ రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజమే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో రష్మిక చనిపోయినట్లుగా కనిపిస్తుంది. దీంతో పుష్ప 2లో రష్మిక చనిపోతుందని.. అందుకే సెకండ్ హీరోయిన్ పాత్రను తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న రష్మిక ఫొటో .. పుష్ప 2 చిత్రానికి సంబంధించినది కాదు.









