AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు..

వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల చికెన్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు పడగా.. వారం రోజులుగా ఎండలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. వాతావరణంలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కోళ్లు మృత్యువాత పడుతుండటంతో.. దీని ప్రభావం చికెన్ ధరలపై పడుతుంది.

కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు బాగా పెరిగాయి. ఏప్రిల్ 1న కేజీ చికెన్ ధర రూ.154 ఉండగా.. ఇప్పుడు రూ.200కిపైగా చేరుకుంది. శుక్రవారం మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్ ధర కేజీ రూ.213 ఉంది. ఇక స్కిన్‌లెస్ చికెన్ ధర నెల క్రితం కేజీ రూ.175 ఉండగా.. ఇప్పుడు రూ. 243కు చేరుకుంది. ఏప్రిల్ 1న రూ.84గా ఉన్న ఫామ్ చికెన్.. గురువారం నాటికి రూ.125కు పెరిగింది.

ANN TOP 10