AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లాయల్టీ ఐలాండ్స్‌కు సునామీ హెచ్చరిక

న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్‌కు అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. మే 12న ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సంఘటన చోటుచేసుకున్న వారం రోజుల్లోనే భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

10 కి.మీ (6.21 మైళ్లు) లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ఇటీవలే తెలిపింది. ఈ నేపథ్యంలో న్యూ కలెడోనియా, ఫిజీ. వనాటు ప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది.

ANN TOP 10