AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం అభ్యర్థి రేసులో లేను..

ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన రూటు సెపరేటు. పార్టీ వ్యవహారాలపై దాపరికం లేకుండా మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తాను సీఎం అభ్యర్థి రేసులో లేనని, తనకు సీఎం పదవి అవసరం లేదని ఆయన ప్రకటించారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరే లేదని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్‌లోనే వర్గ పోరు ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. నల్లగొండలో టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయంతో పార్టీ హై కమాండ్ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావంతో పార్టీలో నూతన ఉత్సవం వచ్చిందని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. స్టార్ క్యాంపెయినర్ హోదాలో పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు.

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి గతంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల క్రితం సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి.. తెలంగాణ సీఎం అభ్యర్థిగా దళిత వ్యక్తిని ప్రకటించాలని డిమాండ్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా తాను చర్చించినట్లు అప్పట్లో కోమటిరెడ్డి తెలిపారు.

ANN TOP 10