యంగ్ చెస్ ట్రైనర్ ఫర్ బేసిక్ లో నోబెల్ బుక్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు నాలుగేళ్ల అద్విత్ రెడ్డి. 2021 లో మంచు లక్ష్మీ కుమార్తె విద్యానిర్వాణ 5 సంవత్సరాల 4 నెలల వయసులో ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2022 లో అల్లు అర్జున్ కుమార్తె అర్హ 4 సంవత్సరాల 8 నెలల వయస్సులో పాత రికార్డును బ్రేక్ చేసింది.ఇప్పుడు తాజాగా 2023లో నానక్ రామ్ గూడా ఒక్రిడ్జ్ స్కూల్ లో ఎల్కేజీ చదువుతున్న 4 సంవత్సరాల 6 నెలల అద్విత్ రెడ్డి ఆ రికార్డును తిరగరాశాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యంగ్ చెస్ ట్రైనర్ బేసిక్ అవార్డ్ కు అద్విత్ రెడ్డి ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో అవార్డును కూడా తీసుకోబోతున్నాడు.అద్విత్ రెడ్డి సాధించిన విజయం పట్ల అద్విత్ రెడ్డి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోచ్ కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు.
