AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రేటర్‌ పరిధిలో.. నేడు, రేపు భారీ వర్షాలు !

అల్పపీడన ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాక, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం, 7న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, సోమవారానికి(8వ తేదీ) అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుందన్నారు. ఇది ఉత్తర దిశగా బంగాళాఖాతం వైపునకు కదలుతూ తీవ్రతరమై తుఫానుగా బలపడుతుందన్నారు. ఈ తుఫాను ప్రభావంతోనూ గ్రేటర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ANN TOP 10