AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఊచలు లెక్కపెట్టాల్సిందే.. గ్రీన్ సిగ్నల్ రాగానే కేటీఆర్‌పై యాక్షన్: సీఎం రేవంత్ రెడ్డి

ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని.. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌ మీద చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ-రేస్‌ స్కామ్ నుంచి తప్పించుకొనేందుకే కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారని చెప్పుకొచ్చారు. గవర్నర్‌ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. గవర్నర్‌ అనుమతి నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారన్నారు. బీజేపీని అవినీతి పార్టీ అని.. ఆ పార్టీని అంతం చేస్తామంటూ విమర్శించిన కేటీఆర్.. ఇప్పుడు అదే పార్టీకి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో.. బీజేపీ బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.    ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అమృత్‌ టెండర్లపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్‌ చేయాలని సవాల్ విసిరారు. రెడ్డి పేరుతో ఉన్నవాళ్లంతా తన బంధువులు కాదని.. సృజన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి అల్లుడని చెప్పుకొచ్చారు. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని అందుకే కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని మహారాష్ట్ర ప్రజలకు కేటీఆర్ చెప్తున్నారని.. అంటే బీజేపీకి వేయాలని చెప్తున్నట్టేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మరోవైపు.. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. కలెక్టర్‌పై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడులకు ప్రోత్సహించే వారిని కూడా వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి హెచ్చరించారు. దాడుల వెనక ఎంతటి వారున్న ఊచలు లెక్కపెట్టాల్సిందేనని.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్‌ఎస్‌ ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. అలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగినా.. కేటీఆర్ ఇలాగే స్పందిస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10