(అమ్మన్యూస్, తిరుమల):
టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబసమేతంగా మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. పిసిసి చీఫ్ గా నియమితులైన తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఆయన మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన దీర్ఘకాల వ్యూహంతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో తనదైన మార్కు చూపిస్తూ దేశంలోనే బెస్ట్ పిసిసి చీఫ్ గా ప్రశంసలందుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పనితీరును కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు.