AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందే

కోర్టుకు హాజరైన నాగార్జున
కొండా సురేఖపై షాకింగ్‌ కామెంట్స్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌): మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన నాంపల్లి కోర్టు ఆయన (నాగార్జున) స్టేట్మెంట్‌ను రికార్డు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నాగార్జున మంగళవారం హాజరై స్టేట్మెంట్‌ ఇచ్చారు. నాగార్జునతో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆ పిటీషన్‌లో నాగార్జున పేర్కొన్నారు.

చర్యలు తీసుకోవాల్సిందే..
ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు. తాజాగా.. కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్‌ లో.. ‘మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి’ అని నాగార్జున కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కాగా, కోర్టుకు నాగార్జునతో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య కూడా వచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10