AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ పూల జాతర వచ్చేసింది..! ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే..

తెలంగాణ పూల జాతరకు వేళైంది..తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ ఈ యేడు వచ్చేసింది. ప్రతీ యేటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. చిన్నా పెద్దా వేడుకలలో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలు తయారు చేసి అంతా కలసి ఆడిపాడతారు.

ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒక్క రోజు మినహా మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, గుమ్మడి, మందార, బంతి, చేమంతి, అడవి చామంతి, గోరింట, బీర పువ్వులతో పేరుస్తుంటారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్ 2 నుంచి 10 తేదీ వరకు జరుపుకోనున్నారు.

ఈ యేడు విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటు చూసిన అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. భక్తితో బతుకమ్మను పూజించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ పూలు అన్ని కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. సద్దుల బతుకమ్మ చివరి రోజు పోయిరా బతుకమ్మ అంటూ వాటిని నీటిలో వదిలి ఆడవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10