క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. శుక్రవారం డీజీపీ జితేందర్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీస్ శాఖకు సిరాజ్ ధన్యవాదాలు తెలిపాడు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు, టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు మహ్మద్ ఖురేషీ పాల్గొన్నారు. సిరాజ్‌కు ఆర్థిక సాయంతోపాటు గ్రూప్ 1, డీఎస్పీ పోస్టు కేటాయించాలని గత కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో 600 గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇదే క్రమంలో డీఎస్పీగా నియామక పత్రం అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం క్రికెట్ ఆడుతూ, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడని కాంగ్రెస్ ప్రభుత్వం సిరాజ్‌కు రావార్డ్, పదవి అందించింది. కొద్ది రోజుల క్రితం బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆమె పోలీస్ లాఠీ అందుకుంది.