మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. తమ కుటుంబంలో ఎటువంటి గొడవ జరగలేదని తాము ఎవరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయలేదని మంచు మోహన్ బాబు కుటుంబం ప్రకటన ఇచ్చినప్పటికీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కలహాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అయ్యేలా చెబుతున్నాయి.
కాలికి గాయంతో ఆస్పత్రికి మంచు మనోజ్ తాజాగా మంచు మోహన్ బాబు కుమారుడు సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయంతో బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు మనోజ్ కు పరీక్షలు నిర్వహించి ఆయనకు చికిత్స చేశారు. మనోజ్ ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో ఆయన వెంట సతీమణి మౌనిక కూడా ఉన్నారు.
నడవలేని స్థితిలో మంచు మనోజ్.. వీడియో వైరల్
అయితే మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకొని మంచు మనోజ్ ను ప్రశ్నించగా దానికి ఆయన ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. భూమా మౌనిక కూడా ఏ మాత్రం సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే మంచు మనోజ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్తి తగాదాలతో మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తి తగదాల నేపథ్యంలో మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని మంచు మనోజ్ పైన మోహన్ బాబు దాడి చేశారని ఈ క్రమంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని మోహన్ బాబు కుటుంబం దీనిపైన స్పందించింది.