తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ఇవాళ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
నూతన గవర్నర్‌కు శుభాభినందనలు తెలియజేశారు. కాగా, రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖంగ్ పూర్తిస్థాయి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. పుదిచ్చేరి లెప్ట్‌నెంట్ గవర్నర్‌గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.