AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవీన్‌ హత్య కేసులో నిజాలు బయటపెట్టిన నిహారిక

నవీన్‌ హత్య కేసులో ఏ3గా ఉన్న ప్రియురాలు నిహారిక స్టేట్మెంట్‌లో విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. ఇంటర్‌ చదువుతున్నప్పుడే నవీన్‌ తాను ప్రేమించుకున్నామని.. చాలాసార్లు మా ఇంట్లోనే ఇద్దరం కలుసుకునేవాళ్లమని చెప్పింది నిహారిక. నవీన్‌ నేను గొడవ పడితే హరిహర కృష్ణ మాకు సర్ది చెప్పేవాడని తెలిపింది. నవీన్‌తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని అని.. అయితే నవీన్‌ తనకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడని తెలిపింది నిహారిక. ఒకసారి.. నవీన్‌ను చంపేసి నిన్ను కిడ్నాప్‌ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని చెప్పాడట.. అయితే ఎందుకు ఇలా అంటున్నావ్‌ అని అడిగితే.. సరదాగా అంటున్నానని చెప్పాడట హరిహర కృష్ణ.

‘కొన్ని రోజుల తర్వాత హరిహర కృష్ణ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నవీన్‌ను చంపడానికి కొన్న కత్తిని రెండు జతల గ్లౌజ్‌ని తీసి నాకు చూపించాడు. ఇవి నవీన్‌ను చంపడానికని నాతో చెప్పాడు.. అయితే నేను నమ్మలేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావని.. అలాంటివి చేస్తే జైలుకు వెళ్తావని.. నేను అతనితో మాట్లాడటంలేదుగా.. అతనే నన్ను మరిచిపోతాడని’ నిహారిక చెబుతోంది. ‘అలాంటి పిచ్చి పనులు చేయకు అని హరిని మందలించాను, దీంతో హరి నేను ఊరికే సరదాకి అన్నాను అని చెప్పాడు’ అని చెబుతోంది. ఈ ఏడాది జనవరి 15న హరి నాకు ఫోన్‌ చేసి తన స్నేహితులందరూ గెట్‌ టుగెదర్‌ పార్టీ చేసుకుంటున్నామని చెప్పాడు, నవీన్‌ కూడా వస్తున్నాడని చెప్పాడు కానీ వారి పార్టీ క్యాన్సల్‌ అయిందని మరుసటి రోజున నాకు హరి ఫోన్‌ చేసి చెప్పాడు’ ఇక ఫిబ్రవరి 17 రోజు ఉదయం నవీన్‌ తన ఫోన్‌ నుంచి ‘హైదరాబాద్‌ వస్తున్నానని’ అని మెసేజ్‌ చేసినట్లు నిహారికా చెబుతోంది.

హరి చెప్పిందే చేశాను
ఆ తర్వాత కొద్దిసేపటికే హరి నాకు ఫోన్‌ చేసి నవీన్‌ వస్తున్న విషయం చెప్పాడు. నవీన్‌ కాల్‌ చేస్తే నేను వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నానని చెప్పమన్నాడు . నేను కూడా నవీన్‌తో అదే విషయం చెప్పాను ..ఎందుకు అలా చేస్తున్నావ్‌ అని నవీన్‌ అంటుండగానే నేను ఫోన్‌ కట్‌ చేశాను . ఇక ఆ తర్వాత హరి నాకు కాల్‌ చేసి నవీన్‌ ఇంకా నీతో మాట్లాడడంట అని అంటే నేను సరే అన్నాను. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని మెసేజ్‌ చేశాడు. శివరాత్రి రోజున ఉదయం వనస్థలిపురం నాగార్జున స్కూల్‌ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిశాను. అప్పుడు హరి పాత బట్టలు వేసుకుని వచ్చాడు ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఎవరివి బట్టలు అని అడిగాను. నవీన్‌ని నేను రాత్రి చంపేశానని.. నా బట్టలకు రక్తం అంటితే హసన్‌ బట్టలు వేసుకున్నానని హరి తనకు హత్య విషయం చెప్పినట్లు నిహారిక చెబుతోంది. హసన్‌కి కూడా నవీన్‌ హత్య విషయం చెప్పానని… అతనితో కలిసి నవీన్‌ అవయవాలు ఉన్న బ్యాగ్‌ని వారి ఇంటికి దూరంగా.. చెట్లలో పడేసినమని తనతో చెప్పినట్లు నిహారికా తెలిపింది. ఆ తర్వాత హరి వరంగల్‌ వెళ్తాను డబ్బులు కావాలి అని అడిగితే నేను హరికి 1,500 ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పినట్లు చెబుతోంది. అప్పుడు హరి తన నాన్న దగ్గరికి వరంగల్‌ వెళ్తాను అని చెప్పి వెళ్లిపోయినట్లు నిహారిక స్టేట్మెంట్‌లో ఉంది..

ఈ విషయం నేను నవీన్‌ స్నేహితులకు కానీ పోలీసులకు కానీ ఎవరికి చెప్పకుండా దాచి పెట్టానని.. ఫిబ్రవరి 20న నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా.. హరి నాకు ఫోన్‌ చేసి ఎల్బీనగర్‌ బస్‌స్టాప్‌లో కలిశాడని నిహారకా అంటోంది. కొద్దిసేపు నాతో మాట్లాడి నవీన్‌ని చంపిన చోటుని… తలపడేసిన చోటుని చూపిస్తానని చెప్పి.. అతని బండిమీద ఎక్కించుకొని బి.యన్‌.రెడ్డి నగర్‌ మీదుగా సాగర్‌ కాంప్లెక్స్‌ దగ్గర చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేసినట్లు చూపించాడు. అక్కడి నుంచి రాజీవ్‌ గృహకల్ప దగ్గర బ్యాగ్‌ పారవేసిన ఏరియాను దాని తర్వాత బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కంపెనీ పక్కన నవీన్‌ తలని, కత్తిని, సెల్‌ఫోన్‌ పడేసిన స్థలమని దూరం నుంచి నాకు హరి చూపించినట్లు నిహారిక చెబుతోంది.

దాచిపెట్టడం నా తప్పే:
ఇంతలోనే నవీన్‌ కోసం అతని ఫ్రెండ్స్‌ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు.. నవీన్‌ వాళ్ల ఫ్రెండ్‌ తరుణ్‌ నిహారికాకు కాల్‌ చేశాడు.. హరి నంబర్‌ ఇవ్వాలని మెసేజ్‌ చేశాడు.. హరి నంబర్‌ను తరుణ్‌కు మెసేజ్‌ చేసింది నిహారికా. ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నవీన్‌ వాళ్ల మామ హరికి ఫోన్‌ చేశారు. అబ్దుల్లాపూర్మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇద్దామని.. హరిని రమ్మనిచెప్పారని.. నిహరికతో హరి చెప్పాడు. అప్పుడే హరి తన ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకుంటానని చెప్పాడని.. చెప్పినట్లే చేసినట్లు నిహారికా స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఫిబ్రవరి 23న నేను హసన్‌కు కాల్‌ చేశాను. హరి మిస్సయినట్లు.. వాళ్ళ అక్కా, బావ మలక్‌ పేట పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్‌ ఇచ్చినట్లు తెలిసింది. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మెసేజులు డిలీట్‌ చేసింది నిహారిక.

లొంగిపోయే ముందు నిహారిక ఇంటికే
ఆ తర్వాత అంటే ఫిబ్రవరీ 24న ఉదయం సుమారుగా 8:30 గంటలకు నిహారికా, తన ఫ్రెండ్‌ ఎన్జీవోస్‌ కాలనీ బస్టాప్‌లో బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తుంటే హరి వచ్చి బస్సు దగ్గర నిలబడి ఉన్నాడు. వెంటనే హరిని చూసిన నిహారిక బస్సు దిగింది. అక్కడ కొద్దిసేపు హరి నిహారికాతో మాట్లాడాడు. పోలీసులకు లొంగిపోతానని చెప్పాడట. ఆ తర్వాత హరి, హసన్‌ నవీన్‌ కుళ్లిపోయిన తలని ప్లాస్టిక్‌ బియ్యం సంచిలో పడేశారు. ఆ తర్వాత తన బైక్‌ బాగా స్మెల్‌ వస్తుండడంతో సర్వీసింగ్‌కు ఇచ్చాడు హరి. తర్వాత నిహారికా, హరి ఇద్దరు కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడే హరిహరి స్నానం చేశాడు. ఇక నిహారికా బావ అడ్వకేట్‌ కావడంతో.. హరిని జరిగిన విషయమంతా అతనికి చెప్పమని నిహారిక చెప్పింది. హరి అదే చేశాడు. వెంటనే లొంగిపోవాలని నిహారికా బావ చెప్పడంతో హరి లొంగిపోయినట్లు నిహారిక కన్ఫెషన్‌ స్టేట్మెంట్‌ చెబుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10