కీవ్: రష్యా గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై ఆరు కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులు, ఎనిమిది డ్రోన్లతో సహా 81 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఉక్రెయిన్ 34 క్రూయిజ్ క్షిపణులను, నాలుగు షాహెద్ సూసైడ్ డ్రోన్‌లను ధ్వంసం చేసింది, ఎనిమిది డ్రోన్‌లు, గైడెడ్ క్షిపణులను తమ లక్షాలను చేరుకోకుండా నిరోధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కింజాల్ క్షిపణిని ఉక్రెయిన్ సైన్యం అడ్డుకోలేకపోయింది.