హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతబస్తి టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని షబాబ్ బిల్డింగ్స్ ప్రాంతంలో క్రాంతి అనే వ్యక్తితో పాటు అతని అనుచరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాహుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న టప్పాచబుత్ర పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.