7 ఫోర్లు, 3 సిక్సులతో బట్లర్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ రాయల్స్ 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఊహించినట్లుగానే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మొదటి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన కౌంటర్-ఎటాకింగ్‌తో బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లీష్ బ్యాటర్ జోస్ బట్లర్ తన IPL 2023 ప్రచారాన్ని అద్భుతంగా మొదలుపెట్టాడు. కేవలం 22 బంతుల్లో 54 పరుగులు చేసిన బట్లర్ ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు.
భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన బట్లర్.. SRH బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మొదటి రెండు ఓవర్ల తర్వాత, బట్లర్ తన గేర్‌ను మార్చాడు. భువనేశ్వర్ కుమార్‌ను కార్నర్ చేసుకుని అద్భుతంగా సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఉప్పల్‌లో మారణహోమం సృష్టించాడు. 54 పరుగుల వద్ద జోస్ బట్లర్ ఔటయ్యాడు. ఫరూఖీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బట్లర్ తన 16వ ఐపీఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.