కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏ వర్గానికి మేలు చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.తొర్రూరు సభ వేదికగా ఆయన ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మతపరమైన మంటలు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రియమైన ప్రధాని కాదు…పిరమైన ప్రధాని అని విమర్శించారు.ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవన్నారు. 15వందల 50 కోట్ల రూపాయలను మహిళా రుణాలను ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు.అందుకే మన రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.