అంతలోనే కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత
గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అప్పటి వరకు సందడిగా ఉన్న వ్యక్తులు ఉన్నపలంగా కుప్పకూలిపోతున్న ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సంఘటలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ విషాదకర ఘటన జగిత్యాలలో జరిగింది. జగిత్యాల జిల్లా గాంధీ నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిల్ భర్త బండారు నరేందర్ మృతి చెందిన ఘటన అందరినీ షాకింగ్‌కి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. శినవారం ఉదయం జగిత్యాల జిల్లా గాంధీ నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరపాలను నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఇక కార్యక్రమ ప్రారంభానికి ముందు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా డ్యాన్స్ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిర్ భర్త బండారు నరేందర్ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఇది గమనించిన కార్యకర్తలు ఆయనకు వెంటనే సీపీఆర్ ఆచేశారు. అనంతరం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ నరేందర్ మూశారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలతో పాటు ఆయన కుటుంబంలో విసాదం నిండింది. ఇక నరేందర్ కన్నమూసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు జరగాల్సిన ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు.