ఎవరా ఇద్దరూ అని జోరుగా చర్చ
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Leakage Case)లో టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ (TSPSC Secretary Anita Ramachandran), టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి (TSPSC Committee Member Lingareddy)కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సెటైర్ విసిరారు. ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. మీకు అర్థం అవుతుందా ‘‘పరువు’’ గల కేటీఆర్ గారూ…?’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేస్తూ రేవంత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేవంత్ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు రేవంత్ ట్వీట్ చేసి బావా.. బావమర్ధులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ట్వీట్‌లో రేవంత్ ప్రస్తావించిన ఈ బావా బావమర్దుల్లో ఒకరు గతంలో సీఎంవోలో పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.