వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 లోగా విచారణ ముగించాలని సుప్రీం సిబిఐకి ఆదేశించింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్ కు అవకాశం ఇవ్వాలని సూచించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి సిబిఐ అధికారి రాంసింగ్‌ను కోర్టు తొలగించింది. కొత్త సిట్ ఏర్పాటు ప్రతిపాదనను సిబిఐ ముందుకు తీసుకొచ్చింది.
వేకానంద రెడ్డి హత్య కేసును ఢిల్లీ సిబిఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్, దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్‌ను కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇదివరకు సిబిఐ దాఖలు చేసింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అభ్యర్థన మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు.
సునీల్ వజ్రాల పేరుతో విలువైన రాళ్ల విక్రయాలు చేసేవాడని, వివేకా హెచ్చరించడంతో ఆయనపై కోపం పెంచుకున్నాడని పేర్కొంది. గంగిరెడ్డితో కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారని కౌంటర్‌లో తెలిపింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో డీల్ కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే వున్నట్లుగా తన కౌంటర్‌లో తెలిపింది. అవినాశ్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసునని , అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ పాత్ర వుందని తెలియడంతో పలుమార్లు ఆయనను సిబిఐ విచారించిన విషయం తెలిసిందే.