AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మూడోస్థానానికి పడిపోయిన హైదరాబాద్ మెట్రో రైల్

ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉండే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ రైలు ఇప్పుడు విస్తరణలో డబ్బుల్లేక విస్తరింపచేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు లేక చతికిలపడింది. బెంగళూరు రెండో స్తానానికి చేరుకుంది.

బెంగళూరులోని ‘నమ్మ’ మెట్రో మార్చి 25వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోను అధిగమించేసింది. అక్కడ మనకంటే పెద్ద మెట్రో రైలు వ్యవస్థగా మారింది. హైదరాబాద్ కంటే మరింత దూరం ప్రయాణించి దేశంలోనే రెండవ పొడవైన మెట్రోగా బెంగళూరు ‘నమ్మ’ మెట్రో రికార్డుల్లోకి ఎక్కింది.

మార్చి 25న 13.71 కిలోమీటర్ల పొడవైన వైట్ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.. దీని ద్వారా నమ్మ మెట్రో ట్రాఫిక్ రూట్ పొడవు 70 కిలోమీటర్లకు విస్తరించింది. ఢిల్లీ మెట్రో ప్రస్తుతం 390 కిలోమీటర్ల ట్రాక్ను కలిగి ఉంది. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల మేర నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోనుంది. రాజధానికి మెట్రో ప్రాజెక్టు వచ్చి 12 ఏళ్లు కావస్తోంది. ఆగష్టు 20 2011న రీచ్-1 (ఎంజీ రోడ్-బైయప్పనహళ్లి) 6.7 కి.మీ విస్తీర్ణంతో ప్రజల రాకపోకలకు అనుమతించి తొలి మెట్రో రైలు హైదరాబాద్ లో పురుడు పోసుకుంది.

హైదరాబాద్ మెట్రో తొలిదశను పీవీపీ విధానంలో ప్రైవేటు ఎల్ అండ్ టీ నిర్మించింది. రెండో దశకు సంబంధించి 62 కి.మీలు ప్రణాళికలు ఉన్నాయి. వీటిలో 31 కి.మీలు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు ముందుకొచ్చింది. అయితే నిధులు మంజూరు చేయకపోవడంతో వెనుకబడింది. 31 కి.మీల బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకూ పనులకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినా రూపాయి విదిల్చలేదు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10