AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అరుణ్ పిళ్లైకి 14 రోజుల కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆయన్ను విచారించారు. సౌత్‌గ్రూప్‌ నుంచి ఆప్‌కు ముడుపుల వ్యవహారంపై ఈడీ అధికారులు ఇద్దరికి ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈడీ కస్టడీ ముగియడంతో రామచంద్రన్‌ పిళ్లైని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. పిళ్లైకి ఏప్రిల్‌ 3 వరకు సీబీఐ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది . మరోవైపు ఈడీ కార్యాలయంలో కవిత విచారణ కొనసాగుతోంది. రామచంద్రపిళ్లైతో ఆర్థిక లావాదేవీలు, సౌత్ గ్రూప్ సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు.

మఖ్యంగా వంద కోట్ల ముడుపులు.. బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు.. ఇతర డాక్యుమెంట్లపైనా కవిత – పిళ్లైలను కలిపి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఎప్పుడు తెలిసింది..? అనుకూల పాలసీ కోసం ఎవరెవర్ని కలిశారు..? ఆప్‌ నేతలతో సంప్రదింపులు, ఒప్పందాలతో పాటు ఢిల్లీ, హైదరాబాద్‌ సమావేశాలపై కవితను విడిగా ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు కేసు కీలక దశలో ఉందని కోర్టు సీబీఐ తెలిపింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10