లండన్: ఖలిస్థానీ మద్దతుదారులు లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంపై నుంచి భారత జాతీయ పతాకాన్ని దించేశారు. ఓ ఖలిస్థానీ కమిషన్ కార్యాలయంపైకి ఎక్కి జాతీయ పతాకాన్ని లాగేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. దీంతో న్యూఢిల్లీలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిష్టినా స్కాట్‌ను పిలిచి భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తంచేసింది. ఇదిలావుండగా ఢిల్లీలో సిక్కులు భారత జాతీయ పతాకాన్ని అవమానించడాన్ని ఖండించారు.