జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.భారత్ టూర్ కు వచ్చిన ఫుమియో కిషిదాకు..ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆహ్వానం పలికారు.ప్రధాని నరేంద్ర మోదీతో కిషిదా భేటీ అయి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరు ప్రధానులు చర్చిస్తారు.జపాన్ జీ7 దేశాలకు అధక్ష్యత వహిస్తుంటే,భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది.దీంతో జీ7,జీ20 మధ్య సహకారంపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉనట్టు తెలుస్తోంది.అంతర్జాతీయ సవాళ్లు,భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యంపై తాను చర్చించనున్నట్టు జపాన్ ప్రధాని ట్విట్టర్ లో ప్రకటించారు.స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పైనా కిషిదా ప్రకటన చేయనున్నారు.